రష్యా నాపై హ్యాకింగ్‌కు పాల్పడుతోంది: ఏంజెలా మెర్కెల్
ABN , First Publish Date - 2020-05-14T00:23:57+05:30 IST
2015లో మెర్కెల్ ఈమెయిల్ నుంచి హ్యాకర్లు డాటా చోరీ చేసినట్లు జర్మన్ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ కాపీని కూడా ప్రదర్శించారు. అయితే దీనిని బండ్‌స్టార్‌ను

బెర్లిన్: తాను స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నా.. తనపై రష్యా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని జర్మనీ ఛాన్స్‌రల్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. దీనికి సంబంధించి తన దగ్గర స్పష్టమైన, బలమైన ఆధారాలు ఉన్నట్లు ఆమె తెలిపారు.
‘‘నేను చాలా నిజాయితీగా చెబుతున్నాను. నాకు చాలా దు:ఖంగా ఉంది. ప్రతిరోజు ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని బలపర్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను. రష్యా కూడా దీనికి స్పందిస్తున్నట్లు ఓ చెయ్యి అందిస్తున్నట్లే కినిపించినప్పటికీ మరో చెయ్యి మాత్రం మాపై నిఘాకు ప్రయత్నిస్తోంది. రష్యన్ బలగాలు దీనికి పాల్పడుతున్నట్లు నా దగ్గర బలమైన ఆధారలు ఉన్నాయి’’ అని ఏంజెల్ మెర్కెల్ అన్నారు.
2015లో మెర్కెల్ ఈమెయిల్ నుంచి హ్యాకర్లు డాటా చోరీ చేసినట్లు జర్మన్ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ కాపీని కూడా ప్రదర్శించారు. అయితే దీనిని బండ్‌స్టార్‌ను టార్గెట్ చేసుకునేందుకు వినియోగించుకుంటున్నారని అక్కడి మీడియా ఆరోపించింది. అయితే అప్పటి హ్యాకర్లను గుర్తించినట్లు మెర్కెల్ తెలిపారు.