అత్యవసర సేవల జాబితాలో అంగన్వాడీ, ఆయుష్
ABN , First Publish Date - 2020-04-03T09:29:46+05:30 IST
లాక్డౌన్ నుంచి మరికొన్ని సేవలు, ఉత్పత్తులకు కేంద్ర హోంశాఖ మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు అంగన్వాడీ, ఆయుష్ విభాగాలను అత్యవసర...
లాక్డౌన్ నుంచి మరికొన్ని సేవలు, ఉత్పత్తులకు కేంద్ర హోంశాఖ మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు అంగన్వాడీ, ఆయుష్ విభాగాలను అత్యవసర సేవల జాబితాలో చేర్చారు. ఆయా విభాగాల సిబ్బంది, రవాణాకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా గురువారం ప్రకటించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆయన లేఖ రాశారు.