సూపర్ సైక్లోన్‌గా మారిన అంఫాన్.. ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-05-19T03:02:42+05:30 IST

‘అంఫాన్’ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ పశ్చి బెంగాల్, సిక్కిం, అసోం,

సూపర్ సైక్లోన్‌గా మారిన అంఫాన్.. ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు

భువనేశ్వర్: ‘అంఫాన్’ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ పశ్చి బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం-గురువారం మధ్య  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అంఫాన్ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారింది. ఒడిశా తీరంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు అంచాన వేస్తున్నారు.


లోతట్టు, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోరాపుట్, రాయగడ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, గజపతి, గంజాం, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

Updated Date - 2020-05-19T03:02:42+05:30 IST