ఆంఫన్‌ తుపానుపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష

ABN , First Publish Date - 2020-05-18T19:03:38+05:30 IST

న్యూఢిల్లీ: వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై పెను తుపానుగా మారిన ఆంఫన్‌ తుపానుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించనున్నారు.

ఆంఫన్‌ తుపానుపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ: వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై పెను తుపానుగా మారిన ఆంఫన్‌ తుపానుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉన్నతాధికారులతో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు. ఎన్‌డీఎంఏ అధికారులు కూడా హాజరౌతారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు గండం పొంచి ఉంది. దీంతో ముందు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రధానితో సమావేశానంతరం అధికారులు ప్రకటన విడుదల చేసే అవకాశముంది. 


ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 1,040 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌‌కు నైరుతి దిశలో 1,200 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైన ఆంఫన్ మరింత వేగంగా బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రంలో గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని... సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పోర్ట్‌లు నిజాంపట్నం, కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Updated Date - 2020-05-18T19:03:38+05:30 IST