మాటలకందని బాధ : అమిత్‌షా ట్వీట్

ABN , First Publish Date - 2020-05-08T17:28:13+05:30 IST

ఔరంగాబాద్ గూడ్స్ రైలు ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు.

మాటలకందని బాధ : అమిత్‌షా ట్వీట్

న్యూఢిల్లీ : ఔరంగాబాద్ గూడ్స్ రైలు ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. మాటలకందని బాధ ఉందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘రైలు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల విషయంలో తీవ్ర బాధగా ఉంది. ఆ బాధ మాటలకు అందడం లేదు. ఈ విషయంపై ఇప్పుడే కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్‌తో మాట్లాడా. సత్సంబంధిత అధికారులతో కూడా మాట్లాడా. అవసరమయ్యే పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా’’ అని అమిత్‌షా ట్వీట్ చేశారు.


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. ఇందులో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వలస కూలీలు మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Updated Date - 2020-05-08T17:28:13+05:30 IST