బెంగాల్‌లో అమిత్ షా.. స్వామి వివేకానంద, ఖుదీరామ్‌లకు నివాళులు

ABN , First Publish Date - 2020-12-19T18:38:22+05:30 IST

పశ్చిమ్ బెంగాల్‌లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. కోల్‌కతాలోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన.. వివేకానందునికి నివాళులర్పించారు.

బెంగాల్‌లో అమిత్ షా.. స్వామి వివేకానంద, ఖుదీరామ్‌లకు నివాళులు

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్‌లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. కోల్‌కతాలోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన.. వివేకానందునికి నివాళులర్పించారు. వివేకానంద చూపించిన మార్గంలోనే మనమంతా నడవాలని ఆయన అన్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ స్వగ్రామం పశ్చిమ్ మిడ్నాపూర్‌ను సందర్శించారు. ఖుదీరామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామంలోని ఆయన కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. వారిని శాలువాతో సత్కరించి తన గౌరవాన్ని చాటుకున్నారు.   స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదని ఆయన వ్యాఖ్యానించారు. చేతిలో భగవద్గీతతో 18ఏళ్ల చిరుప్రాయంలోనే ఉరికంబమెక్కిన వీరుడు ఖుదీరామ్ అంటూ అమిత్ షా ఉద్వేగానికి గురయ్యారు. Read more