కోవిడ్-19పై యుద్ధం : అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

ABN , First Publish Date - 2020-03-29T03:01:43+05:30 IST

రోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశంలో 918కు చేరిన తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం

కోవిడ్-19పై యుద్ధం : అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

న్యూఢిల్లీ : కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశంలో 918కు చేరిన తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న 21 రోజుల అష్ట దిగ్బంధనం సమయంలో వలస కార్మికులకు సంపూర్ణ సహాయం అందజేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. 


స్వస్థలాలకు వెళ్ళిపోవాలని కోరుకునే వలస కార్మికులకు, యాత్రికులకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. 


కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్’ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేసింది. కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభావిత ప్రజలకు సహాయం అందజేసేందుకు కూడా ఈ నిధిని ఖర్చు చేస్తారు. 


కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం మన దేశంలో 918 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 19 మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. 


Updated Date - 2020-03-29T03:01:43+05:30 IST