అమిత్‌షా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఇదీ!

ABN , First Publish Date - 2020-05-09T22:53:22+05:30 IST

తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నానంటూ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం సత్యం లేదని

అమిత్‌షా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఇదీ!

న్యూఢిల్లీ : తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నానంటూ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం సత్యం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఇంతకు షా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరిగింది? ఎందుకు ఆయన స్పందించారు... ఓ మీడియా కథనం ప్రకారం ...


అమిత్‌షా బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నారంటూ... తొందరగా కోలుకోడానికి ముస్లిం మతస్తులందరూ ప్రార్థనలు చేయాలంటూ అమిత్‌షా ప్రార్థించినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వచ్చింది.


‘‘ప్రియమైన ప్రజలారా.... నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశ హితం కోసమే. నేను ఎవర్నీ కుల పరంగా, మత పరంగా ద్వేషించను. కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేనందున దేశ ప్రజలకు సరిగ్గా సేవ చేయలేకపోతున్నా. నేను బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నా. నేను తొందరగా కోలుకోవాలంటూ రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు చేయండి. తొందర్లోనే మళ్లీ మీ ముందుకు వస్తా’’ అని అమిత్‌షా పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ పుకార్లను దృష్టిలో పెట్టుకునే కేంద్ర హోంమత్రి అమిత్‌షా శనివారం స్పందించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని, తన ఆరోగ్యానికి ఢోకా లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సత్యదూరమని షా ప్రకటించారు. 

Updated Date - 2020-05-09T22:53:22+05:30 IST