అమెరికాలో హక్కుల ఉద్యమ నేత లూయిస్ మృతి
ABN , First Publish Date - 2020-07-19T06:59:03+05:30 IST
అమెరికా పౌర హక్కుల ఉద్యమంలో మరో ధ్రువతార నేలరాలింది. పౌరహక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా ఉన్న జాన్ లూయిస్(80) శనివారం మరణించారు...

అట్లాంటా, జూలై 18: అమెరికా పౌర హక్కుల ఉద్యమంలో మరో ధ్రువతార నేలరాలింది. పౌరహక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా ఉన్న జాన్ లూయిస్(80) శనివారం మరణించారు. పౌర హక్కుల ఉద్యమంలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీటీ వివియన్ శుక్రవారం కన్నుమూయగా, లూ యిస్ అట్లాంటాలో తుదిశ్వాస విడిచారు. ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. అమెరికాలో పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలోని గ్రూప్‌లో ఉన్న ఆరుగురు అగ్ర నేతల్లో లూయిస్ పిన్న వయస్కుడు.