హెచ్-1బీ రద్దుతో అమెరికా కంపెనీలకే నష్టం!
ABN , First Publish Date - 2020-06-25T07:31:00+05:30 IST
హెచ్-1బీతో పాటు ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేయడంతో అధిక నైపుణ్యం కలిగిన ఆసియా దేశాల వృత్తి నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని...

వాషింగ్టన్, జూన్ 24: హెచ్-1బీతో పాటు ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేయడంతో అధిక నైపుణ్యం కలిగిన ఆసియా దేశాల వృత్తి నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, ఇదే సమయంలో వలస కార్మికులపై ఆధారపడిన అమెరికా కంపెనీలకు నష్టం కలుగుతుందని ఆ దేశ చట్టసభల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్-1బీతోపాటు ఇతర విదేశీ వర్క్ వీసాలను 2020 చివరి వరకు రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వలసదారుల అవసరం ఎంతో ఉందని అమెరికన్ కాంగ్రెస్ చట్ట సభ్యురాలు జూడీ చూ అన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనుకుంటే వలసదారులను అడ్డుకోవద్దని సూచించారు.