చైనా యాప్‌ల నిషేధం దిశగా అమెరికా!
ABN , First Publish Date - 2020-07-08T07:34:13+05:30 IST
చైనా యాప్‌లకు కష్టకాలం వచ్చినట్లుంది. ఇప్పటికే టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్ నిషేధించింది. తాము కూడా టిక్‌టాక్‌తోపాటు చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్‌లను నిషేధించే ఆలోచనలో...

- విదేశాంగ మంత్రి పాంపియో వెల్లడి
వాషింగ్టన్, జూలై 7: చైనా యాప్‌లకు కష్టకాలం వచ్చినట్లుంది. ఇప్పటికే టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్ నిషేధించింది. తాము కూడా టిక్‌టాక్‌తోపాటు చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్‌లను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఆస్ర్టేలియా కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రిక్ క్రాఫర్డ్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రిన్ కూడా టిక్‌టాక్‌ను నిషేధించాలని కోరారు. టిక్‌టాక్‌కు అమెరికాలో 40 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా ఇప్పటికే చైనాకు చెందిన హువాయ్ సంస్థను 5జీ నెట్వర్క్ నుంచి నిషేధించింది. మిగతా దేశాలను కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరుతోంది. ‘టిక్‌టాక్’ హాంకాంగ్‌లో కూడా తన కార్యకలాపాలను నిలిపివేయాలని మంగళవారం నిర్ణయించింది.