అమెరికాకు తప్పిన ‘షట్‌డౌన్‌’

ABN , First Publish Date - 2020-12-13T08:35:35+05:30 IST

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ గండం నుంచి తాత్కాలికంగా బయటపడింది. కాంగ్రె్‌సలో కొవిడ్‌-19 ప్యాకేజీ రూ.66 లక్షల కోట్ల(9 బిలియన్‌ డాలర్లు) బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం...

అమెరికాకు తప్పిన ‘షట్‌డౌన్‌’

వాషింగ్టన్‌, డిసెంబరు 12: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ గండం నుంచి తాత్కాలికంగా బయటపడింది. కాంగ్రె్‌సలో కొవిడ్‌-19 ప్యాకేజీ రూ.66 లక్షల కోట్ల(9 బిలియన్‌ డాలర్లు) బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం షట్‌డౌన్‌ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాత్కాలిక నిధుల విడుదలకు ఓ బిల్లును శుక్రవారం కాంగ్రెస్‌ ఆమోదించింది. అనంతరం ఆ బిల్లును అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదానికి పంపారు. దీంతో ‘కొవిడ్‌-19’ ప్యాకేజీపై చర్చలకు మరో వారం గడువు లభించింది. తాజాగా డెడ్‌లైన్‌ను వచ్చే శుక్రవారం అర్ధరాత్రి వరకు పొడిగించారు. కరోనా వ్యాక్సిన్లు, చిన్న వ్యాపారాలు, ఆరోగ్య సిబ్బంది, పాఠశాలలు, రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకోవడం తదితరాలకు కొవిడ్‌-19 ప్యాకేజీ బిల్లును రూపొందించారు. 

Updated Date - 2020-12-13T08:35:35+05:30 IST