చెంగ్డూలోని అమెరికా దౌత్యకార్యాలయం ఖాళీ
ABN , First Publish Date - 2020-07-27T07:24:52+05:30 IST
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని

చెంగ్డూ, జూలై 26: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని అమెరికా అధికారులు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 10గంటలకల్లా అమెరికా దౌత్యాధికారులు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని చైనా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆదివారమే కార్యాలయంలోని తమ వస్తువులు, సమాచారం అంతా తరలించినట్లు సమాచారం. ఇప్పటికే కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసుల్ని చైనా మొహరించింది. దౌత్యకార్యాలయం ఉన్న రహదారిని పోలీసులు దిగ్బంధించారు.