అమెజాన్ తాజా ఆదేశాలతో టిక్‌టాక్‌కు మరో షాక్..!
ABN , First Publish Date - 2020-07-11T04:43:39+05:30 IST
భారత్ నిషేధిత పాపులర్ వీడియో షేరింగ్ చైనా యాప్ టిక్‌టాక్‌ను ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని..

భారత్ నిషేధిత పాపులర్ వీడియో షేరింగ్ చైనా యాప్ టిక్‌టాక్‌ను ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులను ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు అమెజాన్ ఈమెయిల్ పంపింది. భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌ను ఇప్పటికే నిషేధించారు. ఈ నేపథ్యంలో.. టిక్‌టాక్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్లు అమెరికా కూడా ప్రకటించడంతో అమెజాన్ ముందుగానే అప్రమత్తమైంది.
అమెరికా అధికారికంగా టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ప్రకటన చేయకముందే ఉద్యోగుల ఫోన్‌లో టిక్‌టాక్ ఉండకూడదని, అది కూడా జూలై 10కల్లా డిలీట్ చేయాలని అమెజాన్ ఆదేశించింది. అమెజాన్ అమెరికాకు చెందిన ఈ-కామర్స్ కంపెనీ అన్న విషయం తెలిసిందే. అయితే.. టిక్‌టాక్‌ను ఫోన్ల నుంచి తొలగించాలని చెప్పిన అమెజాన్ ఉద్యోగులకు ఓ వెసులుబాటు కూడా కల్పించింది. ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లో టిక్‌టాక్‌ను వినియోగించుకోవచ్చని ఉద్యోగులకు స్పష్టం చేసింది.