మతతత్త్వాన్ని బెంగాలీలు నిరాకరించాలి

ABN , First Publish Date - 2020-12-30T08:50:15+05:30 IST

బెంగాల్‌ ప్రజలు మతతత్త్వాన్ని నిరాకరించకపోతే.. ఠాగూర్‌, నేతాజీ వంటి మహనీయుల వారసులు కాజాలరని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌

మతతత్త్వాన్ని బెంగాలీలు నిరాకరించాలి

  • నిరాకరించకపోతే.. బెంగాలీలు ఠాగూర్‌, నేతాజీ వారసులు కాదు 
  • అమర్త్యసేన్‌ వ్యాఖ్యలు.. ఆయన ఓ కబ్జాకోరు: బీజేపీ


కోల్‌కతా/బోల్‌పూర్‌, డిసెంబరు 29: బెంగాల్‌ ప్రజలు మతతత్త్వాన్ని నిరాకరించకపోతే.. ఠాగూర్‌, నేతాజీ వంటి మహనీయుల వారసులు కాజాలరని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  కాగా.. సేన్‌ ఒక కబ్జాకోరు అని బీజేపీ మండిపడింది. ఆయన దేశానికి గానీ, బెంగాల్‌కు గానీ ఏ విధంగానూ ఉపయోగపడలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ దుయ్యబట్టారు. సేన్‌పె బీజేపీ ఆరోపణలకు క్షమాపణ చెబుతూ మమత ఆయనకు లేఖ రాయడం, అందుకు ఆయన తిరిగి ధన్యవాదాలు తెలపడం లాంటివన్నీ ఎన్నికల జిమ్మిక్కులని అభిప్రాయపడ్డారు. 


విద్వేష పూరిత రాజకీయాల్ని బెంగాల్‌ అంగీకరించదు:మమత

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జన్మించిన బెంగాల్‌ గడ్డ, విద్వేషపూరిత రాజకీయాలను లౌకికవాదంపై ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనివ్వదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. ఈ మేరకు బోల్‌పూర్‌ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.  

Updated Date - 2020-12-30T08:50:15+05:30 IST