రైతులు మీ డ్రామాలు నమ్మరు: కేజ్రీకి కెప్టెన్ చురకలు

ABN , First Publish Date - 2020-12-15T15:19:22+05:30 IST

వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన ఓవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్..

రైతులు మీ డ్రామాలు నమ్మరు: కేజ్రీకి కెప్టెన్ చురకలు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన ఓవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం అంతకంతకూ వేడెక్కుతోంది. రైతుల ప్రయోజనాలను కేజ్రీవాల్ అమ్మకానికి పెట్టారని తాజాగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు. దీనిని కేజ్రీవాల్ తిప్పికొడుతూ రైతు బిల్లులు డ్రాఫ్ట్ చేసిన కమిటీలో కెప్టెన్ సభ్యుడని అన్నారు.


'ఈడీకో, ఇతర కేసులకో బయపడే పిరికివాడని కాను. అది ప్రతి పంజాబీకి తెలుసు. మీరు (కేజ్రీవాల్) మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ అంతరాత్మను కూడా అమ్మకానికి పెడతారు. రైతులు మీ నాటకాల మాయలో పడతారని అనుకుంటే మీరు పొరపడినట్టే' అని కెప్టెన్ ట్వీట్ చేశారు. నవంబర్ 23న వ్యవసాయ బిల్లుల్లో ఒక బిల్లును  నోటిఫై చేయడం ద్వారా రైతుల ప్రయోజనాలను కుదవ పెట్టారనే విషయం దేశ రైతులు, ముఖ్యంగా పంజాబ్ ప్రజలకు బాగా తెలుసునని కేజ్రీవాల్‌పై ఆయన మండిపడ్డారు. కేంద్రం నుంచి ఏ తరహా ఒత్తిడి కేజ్రీవాల్‌పై పనిచేస్తోందో ఆయన చెప్పాలని అన్నారు. కేంద్రంతో కేజ్రీవాల్ కుమ్మకై, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్‌పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని కెప్టెన్ అమరీందర్ సింగ్ విరుచుకుపడ్డారు.

Updated Date - 2020-12-15T15:19:22+05:30 IST