ఆ రెండు చోట్ల తప్ప.. అన్నిచోట్ల షాపులు తెరిచేందుకు అనుమతి: కేంద్రం

ABN , First Publish Date - 2020-05-18T02:06:16+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మే 31 వరకూ అమల్లో ఉంటుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన...

ఆ రెండు చోట్ల తప్ప.. అన్నిచోట్ల షాపులు తెరిచేందుకు అనుమతి: కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మే 31 వరకూ అమల్లో ఉంటుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా... దుకాణదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.


కంటైన్మెంట్ జోన్లలో, షాపింగ్ మాల్స్‌లో తప్ప మిగిలిన అన్నిచోట్ల అన్ని దుకాణాలు సోమవారం నుంచి తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే.. షాపుకు వెళ్లే ప్రతీ వినియోగదారుడు ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని, ఒక్కసారికి ఐదుగురిని మించి అనుమతించరాదని మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. రాత్రి 7 తర్వాత కర్ఫ్యూ దృష్ట్యా షాపులన్నీ మూసివేయాలని ఆదేశించింది.

Updated Date - 2020-05-18T02:06:16+05:30 IST