అన్ని పాఠశాలలు జనవరి 15 వరకు మూసివేత: బీఎంసీ

ABN , First Publish Date - 2020-12-30T02:06:04+05:30 IST

అన్ని పాఠశాలలు జనవరి 15 వరకు మూసివేత: బీఎంసీ

అన్ని పాఠశాలలు జనవరి 15 వరకు మూసివేత: బీఎంసీ

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ సంచలనం సృష్టించింది.


ఇండియాలోకి యూకే నుంచి వచ్చిన వారిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటపడడంతో మహా ప్రభుత్వం అప్రమత్తమైంది. యూకే, మిడిల్ ఈస్ట్ మరియు దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారికి మార్గదర్శకాలను సవరించింది. అయితే ముంబైలోని అన్ని పాఠశాలలను జనవరి 15 వరకు మూసివేస్తున్నట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం ప్రకటించింది.

Updated Date - 2020-12-30T02:06:04+05:30 IST