మళ్లీ చెప్పేంతవరకూ సాధారణ సేవలపై నిషేధం: రైల్వే ప్రకటన
ABN , First Publish Date - 2020-08-12T04:19:18+05:30 IST
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో రైళ్ల సాధారణ సేవలపై నిషేధం కొనసాగించేందుకు రైల్వే నిర్ణయించింది.

న్యూఢిల్లీ: కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో రైళ్ల సాధారణ సేవలపై నిషేధం కొనసాగించేందుకు రైల్వే మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 12 వరకూ ఈ సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్టు గతంలో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు రేపటితో ముగియనుండటంతో రైల్వే మరో ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ప్రజారవాణా వ్యవస్థపై నిషేధం ఉన్న తరుణంలో రైల్వేలోనూ సాధారణ సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతమున్న 230 పత్యేక రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తాయని రైల్వే ప్రకటించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభం కాకమునుపే రైల్వేలో సాధారణ సేవలు నిలిచిపోయాయి. ఆ తరువాత వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే నిమిత్తం కేంద్రం శ్రామిక్ రైళ్లను ప్రవేశ పెట్టింది.