గురువారం నుంచి పుదుచ్చేరీలో లిక్కర్ బార్ల మూసివేత

ABN , First Publish Date - 2020-03-19T01:00:52+05:30 IST

రోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పుదుచ్చేరి మరొక చర్యను ప్రకటించింది. గురువారం నుంచి అన్ని లిక్కర్ బార్లను మూసివేయాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి తెలిపారు.

గురువారం నుంచి పుదుచ్చేరీలో లిక్కర్ బార్ల మూసివేత

పుదుచ్చేరి : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పుదుచ్చేరి మరొక చర్యను ప్రకటించింది. గురువారం నుంచి అన్ని లిక్కర్ బార్లను మూసివేయాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి తెలిపారు. యాత్రా స్థలాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళను బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు తెలిపారు. 


కరైకల్‌లోని తిరునల్లార్ శనీశ్వరన్ దేవాలయంలో పవిత్ర స్నానాలను ఆచరించడంపై ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది. 


తాజా గణాంకాల ప్రకారం భారత దేశంలో 151 కోవిడ్-19 కేసులు నిర్థరణ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితులు 1,84,000 మందికిపైగా ఉన్నారు. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 7,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-03-19T01:00:52+05:30 IST