యూపీలో కాంగ్రెస్ కొత్త నియామకాలు

ABN , First Publish Date - 2020-12-06T22:29:54+05:30 IST

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌‌లో కొత్త నియామకాలను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)..

యూపీలో కాంగ్రెస్ కొత్త నియామకాలు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌‌లో కొత్త నియామకాలను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చేపట్టించింది. యూపీ కాంగ్రెస్ ఎస్.‌సి.విభాగం కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ఆదివారంనాడు నియమించింది. ఈ నియామకాలకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేసినట్టు ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఈస్ట్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామ్ సజివన్ నిర్మల్, యూపీ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనూజ్ పునియా, ఉత్తరప్రదేశ్ వెస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యోగి జాతవ్ నియమితులయ్యారు. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వచ్చినట్టు ఆ ప్రకటనలో వేణుగోపాల్ పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని యూపీలో పటిష్టం చేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. గ్రాస్ రూట్ కార్యకర్తల్లోనూ, పార్టీ వివిధ విభాగాల్లోనూ ఉత్తేజాన్ని నింపేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది.

Read more