కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలు ఆరెంజ్ జోన్లే: హరియాణా

ABN , First Publish Date - 2020-05-19T04:00:37+05:30 IST

లాక్ డౌన్ 4.0 నిబంధనల విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కరోనా స్థితిగతులను బట్టి రాష్ట్రల ప్రభుత్వాలు విడివిడగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హరియాణా ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అమలవనున్న లాక్ డౌన్ 4.0 నిబంధనల్ని వెల్లడించింది.

కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలు ఆరెంజ్ జోన్లే: హరియాణా

చండీగఢ్: లాక్ డౌన్ 4.0 నిబంధనల విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కరోనా స్థితిగతులను బట్టి రాష్ట్రల ప్రభుత్వాలు విడివిడగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హరియాణా ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అమలవనున్న లాక్ డౌన్ 4.0 నిబంధనల్ని వెల్లడించింది. 


వీటి ప్రకారం.. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలను ప్రభుత్వం ఆరెంజ్ జోన్లుగానే పరిగణిస్తుంది. ఆ జోన్‌కు సంబంధించిన మార్గదర్శకాలే ప్రజలు పాటించాల్సి ఉంటుంది. మరో వైపు.. బస్సు సర్వీసులను కూడా ప్రభుత్వం అనుమతించింది. అంతరాష్ట్ర సర్వీసులతో పాటూ రాష్ట్రంలోనూ ఆర్‌టీసీ సేవలు రేపటి నుంచీ అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇక విద్యుత్ బిల్లులపై అభ్యంతరాలుంటే  1912కి ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించింది. 

Updated Date - 2020-05-19T04:00:37+05:30 IST