ఆప్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన అల్కాలాంబ
ABN , First Publish Date - 2020-02-08T18:29:39+05:30 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార ఆమాద్మీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్కాలాంబ చేయిచేసుకున్నారు. తన కుమారుడిని

న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార ఆమాద్మీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్కాలాంబ చేయిచేసుకున్నారు. తన కుమారుడిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వల్లే అల్కాలాంబ ఆగ్రహంతో ఊగిపోయనట్టు సమాచారం. అల్కాలాంబ అతడి చెంపమీద కొట్టేందుకు ప్రయత్నించడంతో అతడు తృటిలో పక్కకు తప్పుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో అల్కాలాంబ వారికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చాందినీ చౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అల్కాలాంబ... సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీతో విభేదాల కారణంగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మళ్లీ గతంలో తాను పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో్ నిలిచారు. ఇవాళ చాందినీ చౌక్‌లోని ఠాగూర్ గార్డెన్ ఎక్స్‌టెన్సన్ పోలింగ్ బూత్ వద్ద ఆమె ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వెలుపల అల్కాలాంబ, ఆప్ కార్యకర్త మధ్య వివాదం చోటుచేసుకోవడంతో పోలీసులు వారిని సముదాయించారు. కాగా ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.