ఐదున్నరేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడి అత్యాచారం ?
ABN , First Publish Date - 2020-10-21T09:16:50+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఐదున్నరేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

యూపీలోని అలీగఢ్‌లో ‘పోక్సో’ కేసు నమోదు
ఆగ్రా, అక్టోబరు 20 : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఐదున్నరేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు బాధిత బాలిక తల్లిదండ్రులు ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆడుకునే క్రమంలో బాలుడి ఇంట్లో పడిన తన బంతిని తీసుకొచ్చేందుకు బాలిక వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు. దీంతో బాలుడిపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ) 376 , లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించే ‘పోక్సో’ చట్టం కింద కేసులు నమోదుచేశారు. ఈనేపథ్యంలో నిందిత బాలుడిని మంగళవారం జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. అయితే నిందితుడి వయసు 12 ఏళ్లకు మించకపోవడంతో అతడికి ఐపీసీలోని సెక్షన్ 83 కింద పాక్షిక రక్షణ లభించే అవకాశం ఉందని అంటున్నారు.