అలీబాబా డేటా చౌర్యం

ABN , First Publish Date - 2020-09-16T07:14:37+05:30 IST

చైనా టెక్నాలజీ గ్రూప్‌ అలీబాబా డేటా చౌర్యానికి పాల్పడుతోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ ఘటనపై త్వరలోనే విచారణ

అలీబాబా డేటా చౌర్యం

72 సర్వర్ల ద్వారా చౌర్యం.. భారత్‌ యూజర్ల డేటా చైనాకు..


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: చైనా టెక్నాలజీ గ్రూప్‌ అలీబాబా డేటా చౌర్యానికి పాల్పడుతోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ ఘటనపై త్వరలోనే విచారణ జరుపుతామని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు న్యూస్‌ 18కి అందించిన సమాచారం మేరకు... ఐరోపా కంపెనీలు అందిస్తున్న రేటు కన్నా తక్కువరేటు ఉండడంతో వ్యాపారవర్గాల్లో అలీబాబా క్లౌడ్‌ డేటా సర్వర్లకు అధిక ప్రాచుర్యం ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఆ కంపెనీ భారత్‌లో డేటా చౌర్యానికి పాల్పడుతోంది.


మనదేశంలో ఆపరేట్‌ అవుతున్న అలీబాబాకు చెందిన 72 సర్వర్ల ద్వారా భారత్‌ యూజర్ల సమాచారాన్ని చైనాకు పంపిస్తున్నట్టు గుర్తించినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెప్పాయి. చైనా అధికార యంత్రాంగం పథకం ప్రకారమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోంది. వ్యాపార వర్గాలను ఆకట్టుకునేందుకు వీలుగా కంపెనీ ఫ్రీ ట్రైల్‌ యూసేజ్‌ పేరుతో వారికి ఆఫర్లు ఇస్తూ తన ఉచ్చులోకి లాక్కుంటోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. 

Updated Date - 2020-09-16T07:14:37+05:30 IST