ఇళ్లలో ట్యాప్ తిప్పితే.. ఆల్కహాల్ వస్తోందంటూ..

ABN , First Publish Date - 2020-02-05T22:47:54+05:30 IST

ఇళ్లలో వాటర్ ట్యాప్ తిప్పిన ప్రతిసారీ ఆల్కహాల్ వస్తోందంటూ కేరళలోని చాలకుడికి చెందిన 18 కుటుంబాలు గగ్గోలుపెడుతున్నాయి.

ఇళ్లలో ట్యాప్ తిప్పితే.. ఆల్కహాల్ వస్తోందంటూ..

ఇళ్లలో వాటర్ ట్యాప్ తిప్పిన ప్రతిసారీ ఆల్కహాల్ వస్తోందంటూ కేరళలోని చాలకుడికి చెందిన 18 కుటుంబాలు గగ్గోలుపెడుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు మద్యం నిల్వలను తమ అపార్ట్‌మెంట్ దగ్గరలో పారేశారని వారు చెప్పారు. ఆ పక్కనే అపార్ట్‌మెంట్‌కు చెందిన బావి ఉందని, నేలలో ఇంకిన మద్యం ఆ బావిలో చేరడంతో ఇళ్లలోని వాటర్‌పైపుల్లో మద్యం పారుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Updated Date - 2020-02-05T22:47:54+05:30 IST