అల్‌-ఖాయిదా జవహరి మృతి

ABN , First Publish Date - 2020-11-21T07:15:43+05:30 IST

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖాయిదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌-జవహరి మృతిచెందాడు. అధికారికంగా అల్‌-ఖాయిదా తరఫున ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. అతను అఫ్ఘానిస్థాన్‌లో నెల క్రితం

అల్‌-ఖాయిదా జవహరి మృతి

ఇక ఉగ్ర సంస్థ చరిత్ర పరిసమాప్తి?


కాబూల్‌, నవంబరు 20: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖాయిదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌-జవహరి మృతిచెందాడు. అధికారికంగా అల్‌-ఖాయిదా తరఫున ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. అతను అఫ్ఘానిస్థాన్‌లో నెల క్రితం చనిపోయాడని, అతడిది సహజమరణమని తెలుస్తోంది. ఒసామా-బిన్‌-లాడెన్‌ 1980లో జవహరితో కలిసి పాకిస్థాన్‌లోని పెషావర్‌లో అల్‌-ఖాయిదాను స్థాపించాడు. ఈ సంస్థ 2001 సెప్టెంబరు 11న (9/11) అమెరికా ట్విన్‌ టవర్స్‌ పేలుళ్లకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 2011లో పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఒసామా-బిన్‌-లాడెన్‌ను అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత అల్‌-ఖాయిదాకు చీఫ్‌గా జవహరి వ్యవహరించాడు. అయితే.. ఇప్పుడు జవహరి మరణంతో అల్‌-ఖాయిదా చరిత్ర పరిసమాప్తమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Read more