కరోనా వారియర్స్ కోసం.. అక్షయపాత్ర రూ.22 కోట్లు సేకరణ
ABN , First Publish Date - 2020-12-01T07:46:39+05:30 IST
కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు, వలస కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థ 30 లక్షల డాలర్ల (రూ.22.20 కోట్లు) విరాళాలు సేకరించింది...

హ్యూస్టన్, నవంబరు 30: కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు, వలస కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థ 30 లక్షల డాలర్ల (రూ.22.20 కోట్లు) విరాళాలు సేకరించింది. అక్షయపాత్ర 7వ, చివరి ‘గ్రాటిట్యూట్ గాలా’ అనే కార్యక్రమాన్ని ఈ నెల 21న వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్ అక్తర్.. అక్షయపాత్ర సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘భూక్’(ఆకలి) అనే కవితను ఆలపించారు. నిధుల సేకరణ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు హేమామాలిని, శంకర్ మహదేవన్ వంటి ప్రముఖులతో పాటు 10 వేల మందికి పైగా పాల్గొన్నారు.