2025 నాటికి 50లక్షల మందికి ‘అక్షయపాత్ర’
ABN , First Publish Date - 2020-11-13T09:20:21+05:30 IST
దేశవ్యాప్తంగా బడిపిల్లల కడుపు నింపుతున్న అక్షయపాత్ర ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. 2025 నాటికి దేశమంతటా 50 లక్షల
బెంగళూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బడిపిల్లల కడుపు నింపుతున్న అక్షయపాత్ర ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. 2025 నాటికి దేశమంతటా 50 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు అక్షయపాత్ర ఫౌండేషన్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 20 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో మార్చి నుంచి సెప్టెంబరు వరకు పది కోట్ల భోజన ప్యాకెట్లు అందజేశామని, దేశంలోని మరిన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని విస్తరించే ఆలోచన ఉందని తెలిపారు.