బౌలింగ్ తట్టుకోలేక యూసుఫ్ అతడి వేళ్లు విరగ్గొట్టాలనేవాడు: అక్తర్

ABN , First Publish Date - 2020-08-21T04:10:02+05:30 IST

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, ‘రావిల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్... శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్..

బౌలింగ్ తట్టుకోలేక యూసుఫ్ అతడి వేళ్లు విరగ్గొట్టాలనేవాడు: అక్తర్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, ‘రావిల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్... శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అప్పట్లో మురళీధరన్ స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేక తన సహచర ఆటగాడు మహ్మద్ యూసుఫ్‌ అతడి చేతివేళ్లు విరగ్గొట్టాలని అంటూ ఉండేవాడని గుర్తుచేసుకున్నాడు. ‘‘నేను మురళీధరన్‌కు కొన్ని బౌన్సర్లు సంధించాను. కానీ మురళీధరన్ నన్ను వారిస్తూ... ‘నాకు అలాంటి బంతులు వేయకు.. అవి తగిలితే చచ్చిపోగలను..’ అనేవాడు..’’ అని అక్తర్ గుర్తుచేసుకున్నాడు. ఇక పలు దేశాలకు చెందిన కొందరు టైలెండర్లకు తన బంతులు అనగానే భయం వేసేదని చెప్పుకొచ్చాడు. భారతీయ టెయిలెండర్లు అయితే.. ‘‘మమ్మల్ని అలా కొట్టకు.. మాకు కుటుంబాలు ఉన్నాయి అనేవాళ్లు..’’ అని అక్తర్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-08-21T04:10:02+05:30 IST