రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటున్న బాధితుడిని కాపాడిన మాజీ సీఎం

ABN , First Publish Date - 2020-03-12T12:47:55+05:30 IST

యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోమారు తన గొప్పదనాన్ని చాటుకున్నారు. సైఫైలో హోలీ వేడుకలు చేసుకుని లక్నో వెళుతున్న అఖిలేష్ యాదవ్‌కు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే‌పై గాయాలతో విలవిలలాడుతున్న ఒక యువకుడు...

రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటున్న బాధితుడిని  కాపాడిన మాజీ సీఎం

సైఫై: యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోమారు తన గొప్పదనాన్ని చాటుకున్నారు. సైఫైలో హోలీ వేడుకలు చేసుకుని లక్నో వెళుతున్న అఖిలేష్ యాదవ్‌కు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే‌పై గాయాలతో విలవిలలాడుతున్న ఒక యువకుడు కనిపించగా, అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని బాధితుని సంబంధీకులకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. వివరాల్లోకి వెళితే అఖిలేష్ యాదవ్ సైఫైలో హోలీ వేడుకలు చేసుకుని, లక్నోకు తిరిగి వస్తున్నారు. తాల్‌గ్రామ్ వద్ద రోడ్డుపై ఒక ద్విచక్రవాహనదారుడు గాయాలతో బాధపడుతుండటాన్ని అఖిలేష్ చూశారు. వెంటనే అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు బాధితుడు త్వరగానే కోలుకుంటాడని అన్నారు.

Updated Date - 2020-03-12T12:47:55+05:30 IST