ప్రతి ఒక్కరిని నాశనం చేస్తోన్న బీజేపీ: అఖిలేష్
ABN , First Publish Date - 2020-11-20T20:50:47+05:30 IST
లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడాన్ని ఆయన పూర్తిగా తప్పు పట్టింది. డిసెంబర్ 16, 2020 వరకు బ్యాంక్ ఖాతాధారులు తమ ఖాతా నుంచి గరిష్టంగా రూ. 25,000 విత్
లఖ్‌నవూ: దేశంలోని ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోతోందని ఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దుమ్మెత్తి పోశారు. లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడాన్ని ఆయన పూర్తిగా తప్పు పట్టింది. డిసెంబర్ 16, 2020 వరకు బ్యాంక్ ఖాతాధారులు తమ ఖాతా నుంచి గరిష్టంగా రూ. 25,000 విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించడం ప్రజల్ని దోచుకోవడానికే అని అఖిలేష్ విమర్శలు గుప్పించారు.
‘‘బిజెపి అవినీతి పాలనలో బ్యాంకులు మునిగిపోతూనే ఉన్నాయి. ప్రజల పొదుపులు బ్యాంకుల్లో మునిగిపోతున్నాయి. తాజాగా లక్ష్మి విలాస్ బ్యాంకులో ప్రజల పొదుపులు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని లక్షలాది మంది ఖాతాదారుల డబ్బు యూపీతో పాటు ఇతర రాష్ట్రాల శాఖలలో చిక్కుకున్నాయి. బీజేపీ, ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా పాలన సాగిస్తూ, ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని కల్పోతోంది’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.