అఖిలేష్ విమర్శలతో దిగొచ్చిన యోగి సర్కారు.. గంటల్లోనే నిర్ణయం వాపస్

ABN , First Publish Date - 2020-05-24T21:47:30+05:30 IST

లక్నో: కరోనా ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దంటూ జారీ చేసిన ఆదేశాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు

అఖిలేష్ విమర్శలతో దిగొచ్చిన యోగి సర్కారు.. గంటల్లోనే నిర్ణయం వాపస్

లక్నో: కరోనా ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దంటూ జారీ చేసిన ఆదేశాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. కోవిడ్ ఆసుపత్రుల్లో చేరే పేషంట్లు ఇకపై వార్డుల్లోకి వెళ్లక ముందే మొబైల్ ఫోన్లను వార్డు ఇంఛార్జికి అప్పగించాల్సి ఉంటుందంటూ నిన్న జారీ చేసిన ఉత్తర్వులను వాపస్ తీసుకుంది. వార్డుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించడం వల్ల ప్రయోజనం ఉండదంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ విమర్శలు గుప్పించిన గంటల్లోనే యోగి సర్కారు మేల్కొంది. వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. 


ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులపై వీడియోలు తీస్తారనే ఉద్దేశంతోటే మొబైల్ ఫోన్లపై ప్రభుత్వం వార్డుల్లోకి మొబైల్ ఫోన్లను బ్యాన్ చేసిందని అఖిలేష్ ఆరోపించారు. ఫోన్లను బ్యాన్ చేయడం కాకుండా వార్డుల శానిటేషన్ చేయాలంటూ అఖిలేష్ ట్వీట్ చేశారు. 


మొబైల్ ఫోన్ల ద్వారా ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం నిన్న జారీ చేసిన ఆదేశాల్లో ఉంది. దీనిపై అఖిలేష్ సెటైర్లు వేశారు.  

Updated Date - 2020-05-24T21:47:30+05:30 IST