మళ్లీ తప్పుడు హామీలిచ్చారు : అఖిలేశ్ ఫైర్

ABN , First Publish Date - 2020-05-13T19:18:51+05:30 IST

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్

మళ్లీ తప్పుడు హామీలిచ్చారు : అఖిలేశ్ ఫైర్

లక్నో : ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. 133 కోట్ల మంది భారతీయులకు ప్రధాని మోదీ మళ్లీ తప్పుడు హామీలిచ్చారని ఆయన మండిపడ్డారు.\


‘‘గతంలో 15 లక్షల కోట్లు ప్రకటించారు. ఇప్పుడేమో 20 లక్షల కోట్లు ప్రకటించి 133 కోట్ల మంది భారతీయులకు తప్పుడు హామీ ఇచ్చారు. ఈ సమయంలో మిమ్మల్ని ఎలా నమ్ముతారు? 20 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలున్నాయో ప్రజలు చూడటం లేదు. కానీ తప్పుడు హామీలు ఇస్తున్నారో చూస్తున్నారు’’ అని అఖిలేశ్ ఎద్దేవా చేశారు.


లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాలకు ఊరట కల్పించేందుకు ప్రకటించిన ఈ ప్యాకేజీ దేశ డీజీపీలో 10 శాతం ఉంటుందని, ఈ ప్యాకేజీ ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఆర్థిక దన్నుగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.  

Read more