హైదరాబాద్ పేరు మార్పు సూచనకు అఖిల భారతీయ అఖారా పరిషత్ మద్ధతు
ABN , First Publish Date - 2020-12-01T16:49:53+05:30 IST
హైదరాబాద్ పేరు మార్చాలన్న సూచనకు సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ అఖారా పరిషత్ (ఏబీఏపీ) మద్ధతు ప్రకటించింది....

ప్రయాగరాజ్ (ఉత్తర ప్రదేశ్): హైదరాబాద్ పేరు మార్చాలన్న సూచనకు సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ అఖారా పరిషత్ (ఏబీఏపీ) మద్ధతు ప్రకటించింది. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన సూచనకు అఖారా పరిషత్ ఛైర్మన్ మహంత్ నరేంద్రగిరి మద్ధతు ప్రకటించారు. ఇటీవల యోగి ఆదిత్యనాథ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాజధాని పేరును భాగ్యనగరంగా మార్చాలని కోరారు. తాము యూపీలోకి అధికారంలోకి వచ్చాక ఫైజాబాద్ పేరును అయోధ్యగా, అలహాబాద్ పేరును ప్రయోగరాజ్ గా మార్చామని యోగి చెప్పారు.
పాత, సంప్రదాయ నగరాల పేర్లను గతంలో పాలించిన మొఘలులు మార్చారని మహంత్ నరేంద్రగిరి మంగళవారం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చినా మజ్లిస్ పారట్ీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి అభ్యంతరం ఉండకూడదని నరేంద్రగిరి చెప్పారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా పేరు మారిస్తే నగర భాగ్యం మారే అవకాశం ఉందని చెప్పారు. నగర పేరు మార్పుకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని మహంత్ కోరారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా యోగి చట్టం తీసుకురావడంపై మహంత్ అభినందించారు.