కరోనాపై అధికారులే గందరగోళంలో పడిపోతే ఎలా? అజయ్ మాకెన్

ABN , First Publish Date - 2020-05-09T23:38:56+05:30 IST

కరోనా కేసులను రిపోర్టు చేసే విషయంలో అటు కేంద్రం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత

కరోనాపై అధికారులే గందరగోళంలో పడిపోతే ఎలా? అజయ్ మాకెన్

న్యూఢిల్లీ : కరోనా కేసులను రిపోర్టు చేసే విషయంలో అటు కేంద్రం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. కరోనాపై పోరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ గందరగోళంలో పడిపోయిందని, సాక్షాత్తూ అధికారులే గందరగోళంగా మాట్లాడితే దేశం కరోనా నుంచి ఎలా బయటపడుతుంది? అని సూటిగా ప్రశ్నించారు.


కరోనా విషయంలో దేశ ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని, అధికారులే గందరగోళంలో పడితే ఎలా? అని ఆయన మండిపడ్డారు. కోరోనా విషయంలో ఢిల్లీ రాష్ట్రం క్షమించండి అని అడిగే పరిస్థితికి చేరుకుందని, ఇది పూర్తిగా సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు కరోనా విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలని మాకెన్ సూచించారు. 

Updated Date - 2020-05-09T23:38:56+05:30 IST