రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా అజయ్ మాకెన్ నియామకం

ABN , First Publish Date - 2020-08-17T02:59:45+05:30 IST

రాజస్థాన్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జిగా అజయ్ మాకెన్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా

రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా అజయ్ మాకెన్ నియామకం

న్యూఢిల్లీ : రాజస్థాన్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జిగా అజయ్ మాకెన్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ నేత అవినాశ్ పాండే స్థానంలో మాకెన్‌ను నియమించారు. 


రాజస్థాన్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జిగా అజయ్ మాకెన్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. 


అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నెల 14న రాజస్థాన్ శాసన సభలో జరిగిన విశ్వాస పరీక్షలో మూజువాణీ ఓటుతో నెగ్గిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-08-17T02:59:45+05:30 IST