ఆస్పత్రికి ఐశ్వర్యరాయ్.. ఆమె కుమార్తె కూడా!
ABN , First Publish Date - 2020-07-18T07:33:16+05:30 IST
కరోనా పాజిటివ్‌గా తేలి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఐశ్వర్యరాయ్ (46), ఆమె కుమార్తె (8).. స్వల్ప లక్షణాలతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాలు...

‘నానావతి’కి తరలింపు
ముంబై, జూలై 17: కరోనా పాజిటివ్‌గా తేలి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఐశ్వర్యరాయ్ (46), ఆమె కుమార్తె (8).. స్వల్ప లక్షణాలతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఐశ్వర్యకు, ఆమె కుమార్తెకు జూలై 12న వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వైరస్ సోకిన లక్షణాలు లేకపోవడంతో ఐదురోజులుగా వారు ఇంటివద్దే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక, ఐశ్వర్య భర్త అభిషేక్, మామగారు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే నానావతి ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు తమకు అండగా నిలిచి, తమ కోసం ప్రార్థించినసన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు అంటూ బిగ్ బి శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.