ఒకే విమానంలో సీఎం, ప్రతిపక్ష నేత
ABN , First Publish Date - 2020-10-31T16:04:09+05:30 IST
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ప్రతిపక్షనేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఒకే విమానంలో ప్రయాణించారు. రామనాథపురంలో జరిగిన ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నై నుంచి విమానంలో మదురె వెళ్లారు.

చెన్నై : ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ప్రతిపక్షనేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఒకే విమానంలో ప్రయాణించారు. రామనాథపురంలో జరిగిన ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నై నుంచి విమానంలో మదురె వెళ్లారు. అదే విమానంలో స్టాలిన్‌కూడా ప్రయాణించారు. ముందు వరుసలో ఎడమ వైపు కిటికీ పక్కన సీఎం, కుడి వైపు కిటికీ పక్కన స్టాలిన్ కూర్చున్నారు. ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకుంటారని ఊహించినా అలాంటివి జరుగలేదు. కరోనా నిబంధనల్లో భాగంగా విమానంలో తప్పకుండా మాస్క్‌లు, మొఖాన్ని పూర్తిగా కప్పేలా షీల్డ్ ధరించిన వీరివురు మాట్లాడుకోలేదు. స్టాలిన్‌తో పాటు ఆ పార్టీ నేతలు పూంగొదై, టీకేఎస్ ఇళంగోవన్, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు విజయభాస్కర్, కామరాజ్ ఉన్నారు. మదురై విమానం ల్యాండ్ అయిన తరువాత మొదట సీఎం వెళ్లగా, అనంతరం స్టాలిన్ దిగారు.