లాక్‌డౌన్‌తో తగ్గిన వాయు కాలుష్యం!
ABN , First Publish Date - 2020-07-18T07:53:29+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ సహా ఐదు నగరాలలో వాయుకాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గిందని, ఇది దాదాపు 630 అకాల మరణాలను నివారించిందని ఒక....

రూ.5,173 కోట్ల చికిత్స వ్యయం ఆదా
న్యూఢిల్లీ, జూలై 17: లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ సహా ఐదు నగరాలలో వాయుకాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గిందని, ఇది దాదాపు 630 అకాల మరణాలను నివారించిందని ఒక అధ్యయనంలో తేలింది. కాలుష్యం కారణంగా వ్యాధుల బారిన పడి ప్రజలు వైద్యానికి చేసే సుమారు రూ. 5,173 కోట్ల ఖర్చు ఆదా అయ్యిందని ఈ నివేదిక తెలిపింది. ‘సస్టైన్‌బుల్ సిటీస్ అండ్ సొసైటీ’ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. మార్చి 25 నుంచి మే 11వరకు కాలంలో నమోదైన వాయు కాలుష్య గ ణాంకాలను ఐదేళ్లలో వ్యవధిలో నమోదైన గణాంకాలతో పోల్చిచూ శారు. సూక్ష్మ ధూళి కణాలు ముంబైలో 10 శాతం తగ్గగా, ఢిల్లీలో 54 శాతం తగ్గాయి. ఇక హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాలలో 24 నుంచి 32 శాతం దాకా తగ్గినట్లు శాస్త్రవేత్త లు తేల్చారు. బ్రిటన్‌లోని సర్రీ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.