ఎయిర్ ఇండియా పైలట్‌కు కరోనా!

ABN , First Publish Date - 2020-06-23T04:23:04+05:30 IST

ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్‌ కరోనా బారినపడినట్టు ఆదివారం నాడు తెలిసింది.

ఎయిర్ ఇండియా పైలట్‌కు కరోనా!

సిడ్నీ: ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్‌ కరోనా బారినపడినట్టు ఆదివారం నాడు తెలిసింది. విధుల్లో భాగంగా సదరు పైలట్ శనివారం నాడు ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యాడు. ఆ తరువాత అతడికి జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో పైలట్‌తో పాటూ కాక్ పిట్‌ సిబ్బందినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కాగా.. జూన్ 16 జరిగిన కరోనా పరీక్షల్లోనూ అతడికి నెగెటివ్ అని వచ్చింది. దీంతో సిడ్నీకి ప్రయాణికుల్ని చేరవేసేందుకు సంస్థ పైలట్‌కు అనుమతిచ్చింది. దురదృష్టవశాత్తూ ఈ మధ్యనే అతడు కరోనా సోకడంతో సిడ్నీలో జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో అక్కడి అధికారులు పైలట్‌తో పాటూ కాక్ పిట్‌లో మరో ఇద్దరు సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించింది. 

Updated Date - 2020-06-23T04:23:04+05:30 IST