ఎయిర్ ఇండియా పైలట్‌కు కరోనా.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

ABN , First Publish Date - 2020-05-31T02:58:58+05:30 IST

వందే భారత్ మిషన్‌లో భాగంగా మాస్కోలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలోని పైలట్‌కు కరోనా సోకిడంతో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏమీయేషణ్ విచారణకు ఆదేశించింది.

ఎయిర్ ఇండియా పైలట్‌కు కరోనా.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్‌లో భాగంగా మాస్కోలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలోని పైలట్‌కు కరోనా సోకిడంతో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషణ్ విచారణకు ఆదేశించింది. టేకాఫ్‌కు మందు జరిపిన పరీక్షల్లో సదరు పైలట్‌కు కరోనా సోకినట్టు బయటపడింది. అయితే అప్పటికి విమానం బయలుదేరి కొంత సేపు గడిచిపోయింది. కానీ విషయం బయటకి రాగానే అప్రమత్తమైన అధికారి వెంటనే ఆ ఖాళీ విమానాన్ని వెనక్కు పిలిపించారు. అది దేశరాజధానిలో ల్యాండ్ అవగానే సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా.. ప్రామాణిక ప్రోటోకాల్ పాటిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య అని, డీజీసీఏ ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-05-31T02:58:58+05:30 IST