సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే!
ABN , First Publish Date - 2020-10-04T08:02:14+05:30 IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారన్న వాదనను ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు తోసిపుచ్చింది. ఉరివేసుకోవడం ద్వారానే ఆయన మరణించినట్లు తేల్చింది...
- సీబీఐకి ఇచ్చిన రిపోర్టులో ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు
న్యూఢిల్లీ, అక్టోబరు 3: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారన్న వాదనను ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు తోసిపుచ్చింది. ఉరివేసుకోవడం ద్వారానే ఆయన మరణించినట్లు తేల్చింది. ఈ మేరకు ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా శనివారం వెల్లడించారు. ఆరు మంది సభ్యుల ఫోరెన్సిక్ వైద్య బృందం.. సీబీఐకి అందించిన మెడికో లీగల్ ఒపీనియన్‌లో ఈ వివరాలను పొందుపరిచింది. సుశాంత్‌పై విషప్రయోగం జరిగిందని, గొంతు నులిమి చంపారని వస్తున్న వాదనలను ఫోరెన్సిక్ బృందం ఖండించింది. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని, పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించలేదని సుధీర్ గుప్తా వివరించారు.