ఏఐఏడీఎంకే దళిత ఎమ్మెల్యే కులాంతర వివాహం

ABN , First Publish Date - 2020-10-07T08:09:07+05:30 IST

ఏఐఏడీఎంకే దళిత ఎమ్మెల్యే ప్రభు కులాంతర వివాహం చేసుకున్నారు. సౌంద ర్య అనే 19 ఏళ్ల యువతిని ఆయన సోమవారం పెళ్లాడారు. ప్రభు బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ కాగా.. సౌం దర్య డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నట్లు సమాచారం....

ఏఐఏడీఎంకే దళిత ఎమ్మెల్యే కులాంతర వివాహం

  • బ్రాహ్మణ యువతిని పెళ్లాడిన ప్రభు


చెన్నై, అక్టోబరు 6: ఏఐఏడీఎంకే దళిత ఎమ్మెల్యే ప్రభు కులాంతర వివాహం చేసుకున్నారు. సౌంద ర్య అనే 19 ఏళ్ల యువతిని ఆయన సోమవారం పెళ్లాడారు. ప్రభు బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ కాగా.. సౌం దర్య డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నట్లు సమాచారం. అయితే బ్రాహ్మణ యువతిని ఆయన వివా హం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. సో మవారం వారి పెళ్లి జరుగుతుండగా పెళ్లికూతురి తండ్రి స్వామినాథన్‌ పెళ్లి మండపానికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన కూతురిని ప్రభు అపహరించి పెళ్లి చేసుకోవాలని ఆమెను బ లవంతం చేశారని స్వామినాథన్‌ ఆరోపించారు. ‘‘ కులం నాకు ముఖ్యం కాదు. వారిద్దరి వయసులో చాలా తేడా ఉంది. దానినే నేను వ్యతిరేకిస్తున్నా ను’’ అని స్వామినాథన్‌ మీడియాకు వెల్లడించారు. ఈ ఆరోపణలపై ప్రభు ఓ వీడియోను విడుదల చేశారు. సౌందర్యను తాను గత నాలుగు నెలలుగా ప్రేమిస్తున్నానని తెలిపారు. తామిద్దరం ప్రే మించుకుని పెళ్లి చేసుకున్నామని చెప్పారు.


Read more