అహ్మదాబాద్‌లో కరోనా టెర్రర్

ABN , First Publish Date - 2020-05-25T03:26:49+05:30 IST

గుజరాత్‌లో కరోనా కేసులకు అంతూపొంతూ లేకుండా పోతోంది. గత 24 గంటల్లో కొత్తగా 394 కేసులు

అహ్మదాబాద్‌లో కరోనా టెర్రర్

అహ్మదాబాద్: గుజరాత్‌లో కరోనా కేసులకు అంతూపొంతూ లేకుండా పోతోంది. గత 24 గంటల్లో కొత్తగా 394 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 14 వేల మార్కును దాటేసింది. మొత్తంగా రాష్ట్రంలో 14,063 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, 858 మంది మరణించారు. రాష్ట్రంలో ఇంకా 6,793 కేసులు యాక్టివ్‌గా ఉండగా, అందులో 67 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. ఈ రోజు కొత్తగా 243 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,412కి పెరిగింది. 


ఇక, అహ్మదాబాద్‌లో కరోనా టెర్రర్ కొనసాగుతోంది. గత 24 గంటల్లో నగరంలో ఏకంగా 279 కేసులు వెలుగు చూశాయి. వీటితో కలుపుకుని నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,280కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు మూడొంతులు ఇక్కడే నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 858 మంది మరణిస్తే ఒక్క అహ్మదాబాద్‌లోనే 697 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మరణిస్తే 28 మంది అహ్మదాబాద్‌కే చెందినవారు కావడం గమనార్హం.  


Updated Date - 2020-05-25T03:26:49+05:30 IST