రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర హోంశాఖకు అహ్మద్ పటేల్ లేఖ

ABN , First Publish Date - 2020-04-05T23:01:09+05:30 IST

కరోనా నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు.

రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర హోంశాఖకు అహ్మద్ పటేల్ లేఖ

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. ‘స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫండ్’ కింద కేసుల తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదైనా సరే, కేంద్రం మాత్రం చాలా తక్కువ మోతాదులో నిధులను విడదుల చేసిందని ఆయన అన్నారు.


‘‘ఆర్థిక కమిషన్ ప్రమాణాలతో నిమిత్తం లేకుండా కోవిడ్ - 19 నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు నిధులను పంపిణీ చేయాలని హోంమంత్రి అమిత్‌షాను అభ్యర్థిస్తున్నా’’ అని అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఎస్‌డీఆర్ఎంఎఫ్ నిధుల  కింద 11,092 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా అన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో క్వారంటైన్‌ ఏర్పాట్లతో పాటు ఇతర ఏర్పాట్ల నిమిత్తమై ఈ నిధులను వాడుకోవాలని సూచించింది. 


Updated Date - 2020-04-05T23:01:09+05:30 IST