అహ్మద్ పటేల్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

ABN , First Publish Date - 2020-11-25T13:15:02+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ప్రధాని...

అహ్మద్ పటేల్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ... అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని కొనియాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. తాను అతని కుమారుడు ఫైజల్‌కు ఫోనుచేసి, వారి కుటుంబాన్ని పరామర్శించానని, సానుభూతి ప్రకటించానని తెలిపారు. ఈశ్వరుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Read more