మరో ఆరు వేల ఏళ్ళ తర్వాతే...

ABN , First Publish Date - 2020-07-14T23:27:28+05:30 IST

ఆకాశంలో ఓ అద్భుత ఘటన చోటుచేసుకోనుంది. ఓ తోకచుక్క ఏకంగా ఇరవై రోజులపాటు దర్శనమివ్వనుంది. ఈ తోకచుక్క మళ్ళీ కనిపించేది మరో ఆరు వేల ఏళ్ళ తరువాతే. దీని పేరు... నియోవైజ్. ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ భారీ తోకచుక్క... తన కక్షలో తిరుగుతూ భూమికి అతి సమీపంలోకి రానుంది. ఈ క్రమంలోనే... భారత్‌లో ఈ రోజు(జులై 14) నుంచి ఇరవై రోజులపాటు దర్శనమివ్వనుంది.

మరో ఆరు వేల ఏళ్ళ తర్వాతే...

హైదరాబాద్ : ఆకాశంలో ఓ అద్భుత ఘటన చోటుచేసుకోనుంది. ఓ తోకచుక్క ఏకంగా ఇరవై  రోజులపాటు దర్శనమివ్వనుంది. ఈ తోకచుక్క మళ్ళీ కనిపించేది మరో ఆరు వేల ఏళ్ళ తరువాతే. దీని పేరు... నియోవైజ్. ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ భారీ తోకచుక్క... తన కక్షలో తిరుగుతూ భూమికి అతి సమీపంలోకి రానుంది. ఈ క్రమంలోనే... భారత్‌లో ఈ రోజు(జులై 14) నుంచి ఇరవై రోజులపాటు దర్శనమివ్వనుంది.


సూర్యాస్తమయం తరువాత... ఇరవై నిమిషాలపాటు వాయువ్య దిశలో ఈ తోచకుక్కను చూడవచ్చని చెబుతున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో... భూమికి 103 మిలియన్ కిలోమీటర్ల దూరంలో నియోవైజ్ ఉంటుందని, ఆ రెండు రోజుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు. ఈ తోకచుక్కను మామూలుగానే చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


Updated Date - 2020-07-14T23:27:28+05:30 IST