'నీట్' కట్-ఆఫ్ మార్కులు ఈసారి పెరిగే అవకాశం..!

ABN , First Publish Date - 2020-10-07T23:05:43+05:30 IST

కొత్త సెషన్‌కు జాప్యం లేకుండా త్వరలోనే 'నీట్' ఫలితాలను వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ..

'నీట్' కట్-ఆఫ్  మార్కులు ఈసారి పెరిగే అవకాశం..!

న్యూఢిల్లీ: కొత్త సెషన్‌కు జాప్యం లేకుండా త్వరలోనే 'నీట్' ఫలితాలను వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంత్ తెలిపారు. ప్రముఖ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి అత్యున్నత పోటీ పరీక్ష అయిన 'నీట్' పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు లోబడి గత సెప్టెంబర్ 13న కోవిడ్ జాగ్రత్తల మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించింది. 15.97 లక్షల మందిలో 85-90 శాతం మంది అభ్యర్థులు నీట్ పరీక్షలు రాశాయి. ఇటీవల 'ఆన్సర్ కీ'ని విడుదల చేయగా, అక్టోబర్ 12లోగా పరీక్షా ఫలితాలు విడుదల కావచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈసారి కటాఫ్ మార్కులు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Updated Date - 2020-10-07T23:05:43+05:30 IST