కరోనా ఫైట్: సీఎంల సూచనలు.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

ABN , First Publish Date - 2020-03-23T21:54:52+05:30 IST

దేశీ విమానాల రాకపోకలపై నిఫేధం విధించాలన్న కేంద్రం. పునరాలోచనలో పడ్డ కేంద్రం

కరోనా ఫైట్: సీఎంల సూచనలు.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 400 దాటిన నేపథ్యంలో దేశీయ విమానాల రాకపోకలపై కూడా నిషేధం విధించాలనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. రైళ్లు, రోడ్డు రవాణాపై నిషేధంతో పాటూ విమాన ప్రయాణాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ప్రతిపాదనకు మద్దతు దారులు పెరుగుతున్నారు. 


తాజాగా.. పశ్చిమ బెంగాల్లో విమానాలు దిగేందుకు అనుమతి ఇవ్వద్దంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతకుమునుపే ఢిల్లీ ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రం ఈ నిర్ణయాన్ని పక్కకు పెట్టింది. ఇక కేంద్రానికి రాసిన లేఖలో మమతా బెనర్జీ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  దేశీయ విమానాల రాకపోకలు.. లాక్ డౌన్ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ప్రయాణికులు సామాజిక దూరం పాటించేందుకు అవసరమైన సదుపాయాలు విమానాల్లో లేవని ఆమె స్పష్టం చేశారు. ఈ పరిమితుల దృష్ట్యా దేశీ విమానాల రాకపోకలు కూడా నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. ఇలా ఇద్దరు సీఎంలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడింది. దేశీ విమానాల రాకపోకలను నిలిపివేశే అంశాన్ని కేంద్రం ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-03-23T21:54:52+05:30 IST